జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐతరాజు నర్సింహా
NLG: తెలంగాణ రైతు సంఘం జిల్లా నూతన కమిటీలో చిట్యాల మండలానికి చెందిన ఇద్దరు నేతలకు మరోసారి అవకాశం దక్కింది. ఉరుమడ్ల గ్రామానికి చెందిన ఐతరాజు నర్సింహా జిల్లా ఉపాధ్యక్షుడిగా, వెలిమినేడుకు చెందిన అరూరి శ్రీను జిల్లా కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఈ నెల 23-25 వరకు కొత్తగూడెంలో జరిగే రాష్ట్ర మహాసభలకు హాజరుకానున్నారు.