'విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు'

'విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు'

WGL: ధర్మసాగర్ మండల పోలీసులు శుక్రవారం రాంపూర్ గ్రామంలోని వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో పోలీస్ కళా జాగృతి బృందంచే అవగాహన సదస్సును నిర్వహించారు. డయల్ 100 ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి, గుట్కా, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జానీ పాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.