VIDEO: గుప్త నిధుల తవ్వకాలతో భయాందోళనలో ప్రజలు
KNR: కేశపట్నం (M) మొలంగూర్ ఖిల్లా పరిసరాల్లో గుప్త నిధుల వేట పేరిట దుండగులు అర్ధరాత్రి తవ్వకాలు, క్షుద్ర పూజలు జరిపిన విషయం తెలిసిందే. కాగా పసుపు, కుంకుమతో పూజల ఆనవాళ్లు ఉండడంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది. నిధుల కోసం దుండగులు నరబలి చేద్దామనుకున్నారా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతుందని, పోలీసులు తక్షణమే నిందితులను పట్టుకోవాలన్నారు.