' నేడు అధికారులతో మంత్రి సమీక్ష'

ప.గో: చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఐ. విజయలక్ష్మి తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు సమావేశానికి విధిగా హాజరు కావాలన్నారు. ఉదయం 9 గంటలకు మంత్రి పార్థసారథి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుంటారన్నారు.