పక్కింటికి వెళ్లి వచ్చేలోపు బంగారం మాయం!

పక్కింటికి వెళ్లి వచ్చేలోపు బంగారం మాయం!

RR: భార్యాభర్తలు పక్కింటికి వెళ్లొచ్చేలోపు బంగారం మాయం చేశారు. షాద్‌నగర్‌లోని ఆఫీసర్స్ కాలనీలో నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. కాలనీకి చెందిన దంపతులు కృష్ణ, భాగ్యలక్ష్మి ఇంటికి తాళం వేయకుండా.. పక్కింటికి వెళ్లారు అరగంటలోపు వచ్చేసారు. అంతలోనే ఇంట్లోకి వెళ్లి 15 తులాల బంగారు నగలు చోరీ చేశారని బాధితులు వాపోయారు.