క్రికెట్ బెట్టింగులపై కఠిన చర్యలు

క్రికెట్ బెట్టింగులపై కఠిన చర్యలు

VZM: ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. జిల్లాలో లాడ్జీలు, హాస్టళ్లు, కళాశాలల వద్ద తనిఖీలు నిర్వహించి మొబైళ్లలో ఉన్న బెట్టింగ్ యాప్‌లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. బెట్టింగుల వల్ల యువత ఆర్థిక నష్టం, చదువుల్లో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.