'ఆదోని జిల్లా విషయంలో కూటమి స్పష్టమైన హామీ ఇవ్వాలి'
KRNL: ఆదోని జిల్లా కోసం 84వ రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం నిరాహార దీక్షలో ఇటీవలే రాజీనామా చేసిన కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం పూర్తి అభివృద్ధి చెందుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రజల కష్టాలు తీర్చాలన్నారు.