విజయవంతంగా రైతన్న మీకోసం కార్యక్రమం
కృష్ణా: మామిడికోళ్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం బుధవారం జరిగింది. గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట మల్లికార్జున రావు మాట్లాడుతూ.. రైతులతో చర్చించి, వారి సమస్యలను పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట రాధిక పాల్గొన్నారు.