30 నామినేషన్లు
MDK: తూప్రాన్ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొదటి రోజు 30 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో శాలిక తేలు తెలిపారు. సర్పంచ్ పదవికి 14 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవికి 16 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.