'టీచర్‌ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

'టీచర్‌ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

SRD: కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టి అవమానపరిచిన ఘటనపై ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. దిగ్గే బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీచర్ భర్తపై ఆర్థిక మోసం ఆరోపణల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అమానుషమని ఖండించారు.