బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ డీసీపీ
NTR: వీరులపాడు మండలం వి.అన్నవరం గ్రామంలో ఈ నెల 30న జ్యోతిరావు ఫూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం బందోబస్తు ఏర్పాట్లను విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ పరిశీలించారు.