రోడ్డు ప్రమాదంలో పాదచారుడికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో పాదచారుడికి గాయాలు

ఏలూరు తూర్పు వీధి పిలాస పేటలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొట్టడంతో పాదచారుడు గాయాలపాలయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, లారీ అతివేగమే ప్రమాదానికి కారణం అంటూ సంఘటనా స్థానంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.