సీఎం చంద్రబాబుతో రాయదుర్గం ఎమ్మెల్యే భేటీ
ATP: రాయదుర్గం నియోజకవర్గ తాగునీటి అవసరాల కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.390 కోట్లు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పథకంతో 153 గ్రామాల్లోని 55,726 కుటుంబాలకు ఇంటింటికీ మంచినీరు అందుతుందని పేర్కొన్నారు.