నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుభాషిణి తెలిపారు. డిపో పరిధిలోని ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ సూచనలు సలహాలు తెలియజేయడానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంటల వరకు 8639207675 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.