గిద్దలూరు ప్రజలకు చివరి అవకాశం

గిద్దలూరు ప్రజలకు చివరి అవకాశం

ప్రకాశం: గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఇంటి, ఆస్తి పన్నుల బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీకి నేటితో గడువు ముగియనుంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నారు. గడువు ముగిసిన అనంతరం పూర్తి వడ్డీతోనే పన్నులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.