శ్రీశైలంలో ఏడోరోజుకు చేరుకున్న బ్రహ్మోత్సవాలు
NDL: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం ఆది దంపతులైన భ్రమరాంబదేవి సమేత మల్లికార్జునస్వామి గజవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. అదే విధంగా రాత్రికి క్షేత్ర పురవీధులలో స్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించనున్నారు. శివస్వాములతో క్షేత్ర పురవీధులు కిక్కిరిసిపోయాయి.