భారీ ర్యాలీతో వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్

అనంతపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురంలోని ఆయన నివాసం నుంచి టవర్ క్లాక్ మీదుగా భారీ ర్యాలీతో సోమవారం ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు.