మరికొన్ని సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు

మరికొన్ని సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు

HYD: నగరంలో ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎండీఏల్లో సెక్యూరిటీ విధుల్లోనూ వినియోగించుకోవాలని భావిస్తుంది. అలాగే దశల వారీగా ఐటీ కంపెనీలకు సెక్యూరిటీ విధుల్లోకి తీసుకునేలా విధానం రూపొందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.