అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం: కలెక్టర్
PPM: కురుపాంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ బాలికల పాఠశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులు రూ30లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 40 మరుగుదొడ్లలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగదేశ్వరితో కలిసి కలెక్టర్ గురువారం ప్రారంభించారు.