వయో వృద్ధుల క్రీడా పోటీలు

వయో వృద్ధుల క్రీడా పోటీలు

ADB: అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని వయో వృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. క్యారమ్, చదరంగం పోటీల్లో వృద్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలతో పాటు పాటలు, ఉపన్యాసం అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు 19న బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.