రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు

ప్రకాశం: పుల్లలచెరువు మండలం మురికిమల్ల జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కూలీలతో వెళుతున్న ఆటో గేదెను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఉమ్మడివరం నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.