జోరుగా కోటి సంతకాలు సేకరణ
VZM: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గజపతినగరం మండలంలో జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా సోమవారం పురిటిపెంట, షరాబుల కాలనీ, సంతతోట కాలనీలో ఇంటింటికి వెళ్లి నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.