పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

SRPT: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన, బాధితుల ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజలతో మర్యాదగా ఉంటూ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. ఈ తనిఖీలో సీఐ వెంకట్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.