నేడు బాపట్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు బాపట్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత

BPT: బాపట్లలో సోమవారం విద్యుత్ లైన్‌ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాయి శ్రీనివాస్ తెలిపారు. నరాల శెట్టివారిపాలెం, ఆంజనేయ స్వామి గుడి, సద్దాం స్ట్రీట్, ఉమ్మారెడ్డి బజార్, విజయలక్ష్మి పురం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు.