26 మంది ఉల్లిగడ్డ వ్యాపారుల లైసెన్సులు రద్దు

కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డల లైసెన్సులు కలిగిన 26 మంది వ్యాపారులు ఆగస్టు నెలలో ఎలాంటి కొనుగోళ్లు చేయనందున వారి లైసెన్సులు రద్దు చేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆర్. జయలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఉల్లి రైతులు అమ్మకానికి ఈ-పంట సర్టిఫికెట్, ఆధార్, పాస్‌బుక్, బ్యాంక్ జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు.