బ్యాంకులకు కొత్త డొమైన్‌లు
దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ డొమైన్‌లను .bank.in కు మారుస్తున్నాయి. డిజిటల్ భద్రత పెంచేందుకు RBI ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ్టితో ఈ మార్పు అమలులోకి రానుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి పలు బ్యాంకులు ఇప్పటికే మారాయి. భవిష్యత్తులో బ్యాంకేతర సంస్థలకు ప్రత్యేకంగా 'fin.in' డొమైన్ రానుంది.