మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైంది: డీఈఈ
VKB: జల మహోత్సవంలో భాగంగా పూడూరు మండలం కేరవెళ్లిలో నిన్న అవగహన సదస్సు నిర్వహించారు. భగీరథ నీరు సురక్షతమైందని అపోహలు వీడి తాగాలని మిషన్ భగీరథ డీఈఈ సుబ్రహ్మణ్యం సూచించారు. గ్రామస్తులతో కలిసి వీధుల్లో ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైంది, సురక్షితమైందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు రమేష్, అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.