పసి పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా అరెస్ట్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పసి పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు కొరడా ఝళిపించారు. విజయవాడలో ఇటీవల 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి, మచిలీపట్నంలో విక్రయించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో 6 మంది ప్రధాన సూత్రదారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.