చెరువులు, కుంటలను సంరక్షించాలని ఎమ్మెల్యేకు వినతి

చెరువులు, కుంటలను సంరక్షించాలని ఎమ్మెల్యేకు వినతి

MBNR: మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ మహాసభ ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, దీనివల్ల నీటి వనరులు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.