పక్కాగా ఆరో కప్ గెలుస్తాం: రోహిత్
IPL 2026లో ముంబై ఇండియన్స్ ఈ సారి పక్కాగా ఆరో కప్ గెలుస్తుందని రోహిత్ శర్మ ధీమా వ్యక్తంచేశాడు. రాత్రి నిర్వహించి ఫ్యాన్ ఈవెంట్ MIXలో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారీ అభిమానుల మద్దతు కావాలని, టైటిల్ గెలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని తెలిపాడు. కాగా డెక్కన్ ఛార్జర్స్ తరఫున తన తొలి కప్ అందుకున్న రోహిత్ సారథ్యంలో ముంబై 5 ట్రోఫీలు అందుకుంది.