గన్నవరంలో 'బడి పిలుస్తోంది' కార్యక్రమం
కృష్ణా జిల్లా గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల కాంప్లెక్స్‌లో 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HM సునీల పాల్గొని మాట్లాడారు. చింతలపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 5వ తరగతి విద్యార్థులకు పాఠశాల వసతుల గురించి వివరించారు. అనంతరం చింతలపేటలోని ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.