వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలి: అదనపు కలెక్టర్
SRD: వీధి వ్యాపారులకు త్వరగా రుణాలు ఇవ్వాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెప్మా, బ్యాంకర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వీధి వ్యాపారాలను గుర్తించాలని చెప్పారు. వీధి వ్యాపారలతో కొత్తగా గ్రూపులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మెప్మా పిడి రామాచారి పాల్గొన్నారు.