పెద్దలను గౌరవించడం మానవత్వానికి ప్రతీక: ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో బుధవారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయోవృద్ధులు మన సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలని అన్నారు. వృద్ధుల జ్ఞానం యువతకు దారిచూపే వెలుగని, పెద్దలను గౌరవించడం మానవత్వానికి ప్రతీక అని ఆయన తెలిపారు.