రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
NLG: శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామంలో సోమవారం MLA మందుల సామేలు పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి ఆదివారం తెలిపారు. మండలంలోని మాదారం కలాన్ గ్రామంలోని కాటన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.