జీ రామ్ జీ బిల్లు ఆమోదం.. ప్రియాంక మండిపాటు
వీబీ-జీ రామ్ జీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే నరేగా పథకం నిర్వీర్యం అవుతుందని ఆరోపించారు. ఈ పథకం భారం రాష్ట్రాలపైకి మళ్లిన క్షణం నుంచే అది క్రమంగా అంతరించిపోతుందన్నారు. ఇది పేదల వ్యతిరేక బిల్లు అని చెప్పారు.