మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం శ్రీ నారాయణస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే భక్తుల ద్వారా రూ. 2,09,038 ఆదాయం సమకూరినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదం విక్రయాలు, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, అభిషేకాలు, శ్రీపాద కానుకల రూపంలో ఈ ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.