విద్యార్థినిపై చెయ్యి చేసుకున్న టీచింగ్ స్టాఫ్
TPT: తిరుపతిలో విద్యార్థినిపై టీచింగ్ స్టాఫ్ దాడి చేయడం కలకలం రేపింది. ఎమ్మార్ పల్లిలోని ఓవీఆర్ నర్సింగ్ కాలేజీలో వెన్నెల అనే విద్యార్థినిపై కళాశాల సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి.