ఉగ్ర శిబిరాలు ధ్వంసం సైనిక సత్తాకు నిదర్శనం: ఎమ్మెల్యే

కోనసీమ: ఉగ్ర శిబిరాల ధ్వంసం మన సైనిక సత్తాకు నిదర్శనమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భారత సైన్యం పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పిందని ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో జాతీయ జెండాలతో ఎమ్మెల్యే గ్రామంలో ర్యాలీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం మారణకాండకు భారత్ బదులు చెప్పిందన్నారు.