ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

మేడ్చల్: నాగారం మున్సిపాలిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి లారీ కింద పడి దుర్మరణం చెందాడు. రాంపల్లిలోని వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం ప్రమాదం జరిగింది. యాక్టివా మీద వస్తున్న వ్యక్తి స్కిడ్ అయి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వ్యక్తి తలపై ఎక్కింది. దీంతో అతడు స్పాట్‌లోనే మృతి చెందాడు.