'హస్తకళాకృతులకు మార్కెట్‌లో మంచి డిమాండ్'

'హస్తకళాకృతులకు మార్కెట్‌లో మంచి డిమాండ్'

కృష్ణా: పెడన మండలం చేవేండ్ర గ్రామంలో కలెక్టర్ బాలాజీ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. గుర్రపు డెక్కతో తయారు చేసిన వివిధ రకాల హస్తకళాకృతులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. అందుకు తగ్గట్టుగా వాటిని సరఫరా చేసేందుకు మహిళలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.