100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు: BR నాయుడు

100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు: BR నాయుడు

AP: టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 'తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో సౌకర్యాల కల్పనకు రూ.48 కోట్లు మంజూరు చేస్తున్నాం. దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన విధానం తీసుకురావాలని నిర్ణయించాం' అని పేర్కొన్నారు.