కౌంటింగ్ వేళ ఆర్జేడీ నేత హెచ్చరిక
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ RJD నేత సునీల్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతాయని ఎన్నికల అధికారులను హెచ్చరించారు. తమ పార్టీ అప్రమత్తంగా ఉందని, ఓటర్ల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని కోరారు. ఈ ఎన్నికల్లో RJD 140 నుంచి 160 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.