ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు
అన్నమయ్య: PGRS కార్యక్రమంలో తంబళ్లపల్లె మడలం మేకలవారిపల్లికి చెందిన పీట్ల చిన్నయ్య తన భూమిని పార్టీ నాయకులే కబ్జా చేస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నా, పార్టీ వల్ల కూడా న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. అధికారులు తన భూమిని కబ్జా కోరల నుంచి విడిపించాలని కోరారు.