'దివ్యాంగ విద్యార్థులను ఆదరించాలి'
జగిత్యాలలోని భవితా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులను భారంగా భావించకుండా దేవుడిచ్చిన ప్రసాదంగా ఆదరించాలన్నారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పాటునందించాలని, ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టిఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.