నగరంలో విస్తృతంగా పర్యటించిన కమిషనర్
KDP: కడప కమిషనర్ రాకేష్ చంద్ర నార్త్ జోన్‌లో ఆకస్మిక పర్యటన చేసి పారిశుధ్య పనులను పరిశీలించారు. నాణ్యతతో పాటు గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పాత బస్టాండ్ నుంచి వైవీ స్ట్రీట్ వరకు పర్యటించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలో శుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.