రుషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు: అమర్నాథ్

విశాఖ: జగన్ ప్రభుత్వం రుషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకుల ప్రచారం తగదన్నారు.