VIDEO: లోయర్ మానేర్ డ్యాంలో రెండు గేట్లు ఎత్తిన ఎమ్మెల్యే

KNR: కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. కాగా, తాజాగా లోయర్ మానేరు డ్యాం రెండు గేట్లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎన్ఎండీలో 23 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. రెండు గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , సుడా చైర్మన్ పాల్గొన్నారు.