కేసముద్రంలో యూత్ కాంగ్రెస్ సంబరాలు
MHBD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో కేసముద్రంలో యువజన కాంగ్రెస్ ఘన విజయోత్సవాలు నిర్వహించింది. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ.. ఈ ఫలితం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని అన్నారు.