సింహాద్రి అప్పన్న ఆలయంలో గరుడ సేవ
VSP: సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గురువారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.