సామెత-దాని అర్థం

సామెత-దాని అర్థం

సామెత: ఆలి బెల్లమాయె.. తల్లి అల్లమాయె
అర్థం: పెళ్లయిన తర్వాత అప్పటి వరకు అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగే మగపిల్లలు పెళ్లాం మోజులో పడి అమ్మను నిర్లక్ష్యం చేస్తారు. ఆలి మాటకు విలువ ఇస్తూ అమ్మ మాటను పెడ చెవిన పెట్టే కొడుకులను ఉద్ధేశించి ఈ సామెత వాడుతారు. ఆలి తీపి(బెల్లం), అమ్మ ఘాటు(అల్లం) లా అనిపిస్తోందని ఈ సామెత అర్థం.